* పూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
* ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టి ఈడ్చుకెళ్లడమే ప్రమాదానికి కారణం
ఆకేరు న్యూస్, కర్నూలు : ఏసీ బస్సు అగ్ని కీలల్లో చిక్కుకుంది..ప్రయాణికుల హాహా కారాలతో దద్దరిల్లింది ..
కొందరు ప్రయాణికులు కిటికీలు పగులగొట్టి ప్రాణాలు కాపాడుకోగలిగారు.మిగిలిన వారంతా మంటల్లో చిక్కుకుని మాంసపు ముద్దలు,అస్థిపంజరాలుగా మిగిలిపోయారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు ప్రధాన రహదారిపై దారుణం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు కి వెళుతున్న స్లీపర్ బస్సు ప్రమాదానికి గురయింది.. ప్రయాణికులు చెప్పిన కథనం ప్రకారం శుక్రవారం ఉదయం 3గంటల 30 నిమిషాల సమయంలో ఒక బైకును ఢీకొట్టి దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది ..దీంతో ఏర్పడిన మెరుపుల వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నదని భావిస్తున్నామన్నారు .. ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు..కొంతమంది కిటికీల అద్దాలను పగుల గొట్టి 21 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. 41 మంది ప్రయాణిస్తున్న బస్సులో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు..21 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు..ద్వి చక్రవాహనం పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే యువకుడు సైతం మృతి చెందాడు..
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
*బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
ప్రమాదంపై సీఎస్, డీజీపీతో మాట్లాడిన సీఎం అవసరమైన అన్నిరకాల సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు..
………………………………………..
