* అసెంబ్లీ లో ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
* శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు సమావేశానంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ (SPEAKER PRASADKUMAR)అధ్యక్షతన బీఏసీ భేటీలో జరిగింది. ఐదు నుంచి ఏడు పని దినాలపాటు కొనసాగే అవకాశం ఉంది. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంగళ, బుధ వారాలు విరామం ఇచ్చారు. సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTHREDDY) మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పంగా రూపొందించామని తెలిపారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి (TELANGANA THALLI)అవతరణ దినం నిర్వహిస్తామన్నారు. నా తెలంగాణ.. కోటి రతనాల వీణ.. అనేది అక్షర సత్యం అన్నారు. అస్తిత్వానికి మూలం సంస్కృతి.. సంస్కృతికి మూలం తల్లి అని వెల్లడించారు. తెలంగాణ జాతిభావనకు జీవం పోసింది తెలంగాణ తల్లి విగ్రహం అని వివరించారు. తెలంగాణను ప్రకటించిన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ (SONIAGANDHI) జన్మదినాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఏటా అదే రోజున ఉత్సవాలు నిర్వహించడం సోనియాకు కానుకగా వివరించారు.
………………………………………..