ఆకేరు డెస్క్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇండోర్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో ఓ జీపు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. జీపులో ఉన్న ఎనిమిది మంది మరణించారు. మరొక వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత గుర్తు తెలియని వాహనం డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
———————————-