Kaloji Narayana Rao Jayanti
* ఎంపీ కడియం కావ్య
* ఘనంగా కాళోజీ జయంతి
ఆకేరు న్యూస్, హనుమకొండ:కాళోజీ జీవితం ఆదర్శనీయమని ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజాకవి కాళోజీ తన కలం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులను కాళోజీ రచనల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువచ్చి, వారిలో చైతన్యం నింపిన కాళోజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.
కాళోజీ వరంగల్‌కు చెందినవారు కావడం గర్వకారణమని తెలిపారు. ప్రజాకవి కాళోజీ రచనలు, సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, ముఖ్యంగా యువత కాళోజీ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కాళోజీ నారాయణరావు ఆశయాలను కొనసాగిద్దామని నినాదాలు చేశారు.
కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్ విద్యార్థి, కోశాధికారి పందిళ్ల అశోక్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి. శ్రీనివాసరావు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఇతర అధికారులు, పలువురు కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
* కాళోజీ కళాక్షేత్రంలో…
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ విగ్రహానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
