* ఘట్కేసర్లో ఆలస్యంగా వెలుగులోకి
* వారం రోజుల తర్వాత మృతదేహం వెలికితీత
* పూడ్చినస్థలంలోనే పోస్టుమార్టం
* స్థల లావాదేవీలా.. వివాహేతర సంబంధం కారణమా?
* హత్యపై పలు అనుమానాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ ( MPTC ) గడ్డం మహేష్ ( Gaddam Mahesh ) (42) హత్య ( Murder ) సంచలనంగా మారింది. మహేష్ కనిపించడం లేదని ఈ నెల 17న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంచారు. విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా.. గడ్డం మహేష్‌ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్‌లో పాతి పెట్టినట్లు గుర్తించారు. దీంతో చనిపోయిన వారం రోజుల తర్వాత ఘట్ కేసర్ ఎమ్మార్వో ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీశారు. పూడ్చినస్థలంలోనే పోస్టుమార్టం చేశారు. మాట్లాడుకుందామని కార్యాలయానికి పిలిచి కర్రలతో దాడి చేసి మహేష్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థల లావాదేవీలా.. వివాహేతర సంబంధం కారణమా? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ కేసులో చిన్న, పరమేష్ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు మరికొందరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
———————————–