ఆకేరు న్యూస్ డెస్క్ : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపు విషయంలో భారీ కుంభకోణం (scam) జరిగింది అని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో కర్ణాటకలో ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపి, జేడీఎస్ పార్టీలు గతంలోనే ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లట్‌కి కూడా ఫిర్యాదు చేశాయి. తాజాగా ఈ కేసు విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రశ్నించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లట్ (Governor Thavarchandh Gehlath)శనివారం అనుమతి ఇచ్చినట్టుగా పీటీఐ కథనం పేర్కొంది. ఇదిలావుంటే, ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య గతంలోనే స్పందించారు. కేవలం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ప్రతిపక్షాలు తనకు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్‌కి లింకు పెడుతూ ఆరోపణలు చేస్తున్నాయని, కానీ అలాంటి ఆరోపణలకు తాను భయపడే రకం కాదు అని స్పష్టంచేశారు.
————————————