* ఎస్ పి సుధీర్ రామనాధ్ కేకాన్
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పురస్కరించుకొని బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందికి అందిస్తున్న భోజన పదార్ధాలు హోం గార్డు నుండి ఐపీఎస్ అధికారుల వరకు ఒకే విధంగా మెనూ పాటించాలని ములుగు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్ నాథ్ కేకాన్ సూచించారు. ఆయన భోజన పదార్థాలు తయారు చేస్తున్న మెస్సును పరిశీలించారు. మెస్‌లో భోజన నాణ్యతను పరిశీలించి, అన్ని ర్యాంకుల అధికారులు, సిబ్బంది తో పాటు పారిశుధ్య కార్మికులకు కూడా సమానమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని ఆదేశించారు.
భోజనం పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ స్పష్టం చేశారు. ఎస్పీ స్థాయి అధికారి స్వయంగా తీసుకునే ఆహారమే బందోబస్తు విధుల్లో ఉన్న ప్రతి సిబ్బందికి అందించాలని ఆహార విభాగం ఇన్చార్జ్ అధికారులను ఆదేశించారు. బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బంది ఆరోగ్యం, భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి తో పాటు ఓ ఎస్ డి శివమ్ ఉపాధ్యాయ, ఏ ఎస్ పి ఏటూరునాగారం మనన్ బట్, ఎస్ బి సి ఐ శంకర్, ఏటూరునాగారం సి ఐ శ్రీనివాస్, స్థానిక పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………….
