* భారత న్యాయ వ్యవస్థపై అత్యంత విశ్వాసం ఉంది
* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత బెయిలు(Mlc Kavitha Bail)పై సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy) చేసిన వ్యాఖ్యలనుద్దేశించి బుధవారం సుప్రీంకోర్టు(Suprim Court) ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం లాంటి వ్యక్తులకు ఇది తగునా అని ప్రశ్నించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం స్పందించారు. ట్విటర్ (ఎక్స్) లో పోస్టు పెట్టారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్రెడ్డి. న్యాయ వ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా.. తనకు అత్యంత నమ్మకం ఉందని వెల్లడించారు. తన వ్యాఖ్యలు యవ్యవస్థను..ప్రశ్నించినట్టు ఆపాదించారని అన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
