* గుడ్లవల్లేరు కాలేజ్‌లో దారుణం
* సోషల్‌మీడియాలో వీడియోలు వైరల్
* ఉలిక్కిపడ్డ బాలికలు, తల్లిదండ్రులు
* ఆందోళన చేపడుతున్న విద్యార్థినులు
* విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్, విజయవాడ : కృష్ణా జిల్లా గుడివాడ(Gudiwada) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీక్రెట్ కెమెరా(Secret Camera) కలకలం రేపింది. కాలేజ్‌లోని బాలికల హాస్టల్ వాష్‌రూమ్(Hoster Washroom)లో హిడెన్ కెమెరాలు కనిపించడం సంచలనంగా మారింది. దాదాపు 300కుపైగా విద్యార్థినుల వీడియోలు రికార్డు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోలను అదే కాలేజ్‌లోని బాయ్స్ హాస్టల్(Boys Hoster)లో అమ్మినట్లు సమాచారం. గర్ల్స్ హాస్టల్లో ఉండే ఓ అమ్మాయి సాయంతో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ వీడియోలు రికార్డు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో గురువారం అర్ధరాత్రి నుంచీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వియ్ వాంట్ జస్టిస్ (We Want Justice)అంటూ ఆందోళన కొనసాగించారు. హిడెన్ కెమెరాలో రికార్డయిన వీడియోలను అమ్ముకున్నాడంటూ బీటెక్ ఫైనల్ విద్యార్థిపై దాడికి యత్నించారు. వారం రోజుల క్రితమే హిడెన్ కెమెరాను గుర్తించి ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు సీరియస్
ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chanrababu) సీరియస్ అయ్యారు. వెంటనే అక్కడకు వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra)ను, కృష్ణాజిల్లాను ఆదేశించారు. మంత్రి నారా లోకేశ్(Minister Lokesh) కూడా స్పందించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు ఆదేశించినట్లు లోకేశ్ చెప్పారు. కాగా, విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు కాలేజ్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వీడియోలు రికార్డు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్‌ని ప్రశ్నించారు. విజయ్ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా కొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.