* ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్
ఆకేరు న్యూస్ డెస్క్ : బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణించారంటూ వస్తున్న వార్తలను
ధర్మేంద్ర కూతరు ప్రముఖ హీరోయిన్ ఈషా డియోల్ ఖండించారు. ధర్మంద్ర మరణించారంటూ
వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ధర్మంద్ర బాంబేలోని బ్రీచ్ క్యాండీ
హాస్పిటల్ చికిత్స పొందుతున్నారని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా ధర్మంద్ర సతీమణి హేమామాలిని ఈ వార్తలను ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కుటుంబ సభ్యులను వేదనకు గురిచేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
……………………………………………………..
