
* ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘మమ్మీ నన్ను క్షమించు ఇలాంటి పని చేస్తున్నందుకు. నాకు ఇంక బతకాలని లేదు. ఆ శ్రీనుగాడు మనల్ని మనశ్వాంతిగా ఉండనీయడు. నేను చనిపోవడానికా కారణం ఆ శ్రీను(పెద్దనాన్న), వాళ్ల అమ్మ, నాన్న. మీ డాడీనే చంపినోడికే మీరో లెక్క అన్నాడు. నేను కచ్చితంగా విన్నాను. వాడికి శిక్ష కచ్చితంగా పడాలి.’ అని సూసైడ్‌నోట్ రాసి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. కొంపల్లిలో ఉంటున్న ఆళ్లకుంట రవి, అనురాధ పెద్దకుమార్తె పింకీ (17) ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థిని. 15 నెలల క్రితం తండ్రి రవి అనారోగ్యంతో మృతి చెందాడు. దూలపల్లిలో నివాసముంటున్న మృతురాలి పెదనాన్న శ్రీనివాస్ కొంత కాలంగా పింకీ కుటుంబసభ్యులను నానా రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తరచూ కొంపల్లిలోని పింకీ ఇంటికి వచ్చిపోతున్నాడు. కొన్ని సార్లు యువతి పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్టు స్ధానికులు పేర్కొంటున్నారు. అంతేకాక ఫైవ్‌స్టార్ ఫైనాన్స్‌కు చెందిన వ్యక్తులు కూడా ఇంటికి వచ్చి మీనాన్న మాదగ్గర డబ్బులు తీసుకున్నాడు, కట్టమని వేధింపులకు గురిచేశారని, తన పెదనాన్న శ్రీనివాస్ వేధింపులు, ఫైనాన్స్ వ్యాపారుల వేఽధింపులతో తీవ్రంగా మానస్తాపానికి గురై తాను ఆత్మచేసుకుంటుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. పోలీసులు సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువతి మృతికి కారణమని భావిస్తున్న పెదనాన్న శ్రీనివాస్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైవ్‌స్టార్ ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులపై దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………………