
* మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష రావు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కు పోతోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమన బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రైతులు యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీలో యూరియా కొరత గురించి, వరదల గురించి చర్చించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని హరీష్ విమర్శించారు. రాష్ట్రంలో రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా పంట బోనస్ హామీలతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందన్నారు.ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం శోచనీయమన్నారు.
………………………………………………..