* ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా చర్యలు
* కోమటిరెడ్డి లేఖతో యాక్షన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హీరో, నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్(N Convention) సెంటర్‌పై హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు గతంలోనే చాలా ఫిర్యాదులు అందాయి. ఎఫ్టీఎల్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఇటీవల మరోసారి ఫిర్యాదు చేసింది. అలాగే.. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanthreddy)కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkatreddy) కూడా లేఖరాశారు. తుమ్మిడి చెరువు(Tummidi Cheruvu)ను కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని లేఖలో మంత్రి ఆరోపించారు. శాటిలైట్ ఫొటోలతో సహా ఆధారాలను హైడ్రా(Hydra)కు మంత్రి సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయమే ఎన్ కన్వెన్షన్(N Convention) వద్దకు వెళ్లిన హైడ్రా అధికారులు రెండు హాళ్లను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడికి చెందిన భవనాన్నే కూల్చివేయడంతో మిగతా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
————————————