ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువునష్టం కేసులో మంత్రి సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణను నాంపల్లి కోర్టు డిసెంబర్ 12కు వాయిదా వేయగా.. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరుకావాలని మంత్రి సురేఖను కోర్టు ఆదేశించింది.
……………………………..