* బండి సంజయ్ – హోం శాఖ సహాయ మంత్రి
* రామ్మోహన్ నాయుడు – ఉపరితల పౌర విమానయాన శాఖ
* పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్మూనికేషన్
* శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి
*అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జై శంకర్‌కు పాత శాఖలే
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : సీనియర్ బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ( Minister Kishan reddy ) కి బొగ్గు గనుల శాఖ కెటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. గతంలో హోం శాఖ సహాయ మంత్రి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణకు చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హోం శాఖ ( సహాయ మంత్రి )ను కెటాయించారు. కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఉపరితల పౌర విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి ( సహాయ మంత్రి హోదా) , కమ్మూనికేషన్,శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోది ( Narendra modi ) తో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30 మందికి కేబినెట్ హోదా, 36 మందికి సహాయ మంత్రి హోదా దక్కింది.
* వారికి పాత శాఖలే
గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ సీనియర్ నేతలకు అవే శాఖలను కెటాయించారు. హోం మంత్రిగా అమిత్ షా, రక్షణ శాఖ, రాజ్ నాథ్ సింగ్, రోడ్డు, రవాణా శాఖ, నితిన్ గడ్కరీ, ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ , విదేశీ వ్యవహారాల బాధ్యతలు జై శంకర్ లకు తిరిగి అవే శాఖలను అప్పగించారు.
కేంద్ర కేబినెట్ మంత్రులు వారి శాఖలు
1. రాజ్ నాథ్ సింగ్ – రక్షణ శాఖ
2. అమిత్ షా – హోం వ్యవహారాలు
3. నితిన్ జైరామ్ గడ్కరీ – రోడ్డు రవాణా, రహదారులు
4. జగత్ ప్రకాష్ నడ్డా – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి, రసాయనాలు, ఎరువులు
5. శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ, గ్రామీణాభివృద్ధి
6. నిర్మలా సీతారామన్ -ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
7. డా. సుబ్రహ్మణ్యం జైశంకర్ – విదేశీ వ్యవహారాలు
8. మనోహర్ లాల్ -హౌసింగ్, పట్టణ వ్యవహారాలు
9. హెచ్ డీ కుమారస్వామి – భారీ పరిశ్రమలు, ఉక్కు
10. పీయూష్ గోయల్ – వాణిజ్యం, పరిశ్రమలు
11. ధర్మేంద్ర ప్రధాన్ – విద్యాశాఖ
12. జితన్ రామ్ మాంఝీ – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
13. రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ – పంచాయతీ రాజ్ శాఖ, మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమలు
14. సర్బానంద సోనోవాల్ – ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు
15. డాక్టర్ వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత
16. కింజరాపు రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
17. ప్రహ్లాద్ జోషి – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ, కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ
18. జువల్ ఓరం -గిరిజన వ్యవహారాల శాఖ
19. గిరిరాజ్ సింగ్ – జౌళి శాఖ
20. అశ్విని వైష్ణవ్ – రైల్వేశాఖ, సమాచార, ప్రసార మంత్రి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
21. జ్యోతిరాదిత్య ఎం. సింధియా -కమ్యూనికేషన్స్ మంత్రి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
22. భూపేందర్ యాదవ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
23. గజేంద్ర సింగ్ షెకావత్ -సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ
24. అన్నపూర్ణా దేవి -మహిళా శిశు అభివృద్ధి శాఖ
25. కిరణ్ రిజిజు-పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ
26. హర్దీప్ సింగ్ పూరి- పెట్రోలియం, సహజ వాయువు శాఖ
27. డాక్టర్ మన్సుఖ్ మాండవియా -కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ
28. జి. కిషన్ రెడ్డి – బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల శాఖ
29. చిరాగ్ పాశ్వాన్ – ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
30. సీఆర్ పాటిల్ – జలశక్తి శాఖ
————————————-
మంత్రులు స్వతంత్ర హోదా
——————————————-
1 ఇంద్రజిత్ సింగ్ – స్టాటిస్టిక్స్, ప్రణాళిక శాఖ
2 డాక్టర్ జితేంద్ర సింగ్ – శాస్త్ర, సాంకేతిక , ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ
3. అర్జున్ రామ్ మేఘవాలే – పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయ శాఖ
4.ప్రతాప్ రావ్ జాదవ్ – ఆయుష్, ఆరోగ్య ,కుటుంబ సంక్షేమం
5 జయంత్ చౌదరీ – నైపుణ్యాభివృద్ధి, విద్య, పారిశ్రామికాభివృద్ధి
ఇంకా సహాయ మంత్రులు ఉన్నారు ..
—————————————–