
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
* అమర వీరులకు నివాళులు
*సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపిన ప్రధాని
ఆకేరు న్యూస్ డెస్క్ : రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు (PM Modi Raksha Bandhan ) తెలియజేశారు. అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఇదే రోజు కీలక ఘట్టంగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల ధైర్యాన్ని స్మరించుకుని మోదీ నివాళులు తెలిపారు
చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ సంబరాలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. ఈ సంర్భంగా మోదీ చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆశీర్వదించారు. వారితో కాసేపు సరదాగా గడిపారు. చిన్నారులకు మిఠాయిలు పంచారు.
———————————-