Narlapur Woman Missing
* ఆచూకీ చెబితే బహుమానం!
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యమైంది. గ్రామానికి చెందిన ఎడ్ల మానస (35) ఈ నెల 21వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆమె భర్త ఎడ్ల జలంధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేపట్టినట్లు మేడారం (నార్లాపూర్) ఎస్సై అచ్చ కమలాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మానస ఆచూకీ తెలిసినవారు లేదా ఎక్కడైనా ఆమెను గుర్తించినవారు వెంటనే 8712670131, 8712670132 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. మహిళ ఆచూకీ తెలిపి పోలీసులకు సహకరించిన వారికి తగిన బహుమతి (Reward) అందజేస్తామని వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

