నార్సింగిలో అగ్నిప్రమాదం
* పసిఫికా హిల్ క్రెస్ట్ అపార్టుమెంట్లో ఎగిసిపడుతున్న మంటలు
* 12వ అంతస్తు నుంచి 18వ అంతస్తు వరకు వ్యాపించిన అగ్నికీలలు
* భయాందోళనలో అపార్టుమెంట్ వాసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగర శివార్లలోని నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం (Narsingi Fire Accident) చోటుచేసుకుంది. పసిఫికా హిల్ క్రెస్ట్ అపార్టుమెంట్ (Pacifica Hill Crest)లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు 12వ అంతస్తు నుంచి 18వ అంతస్తు వరకు వ్యాపించాయి. దీంతో అపార్టుమెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అపార్టుమెంట్లో మంటలు వేగంగా (Narsingi Fire Accident) వ్యాపించడంతో నివాసితులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Department) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భవనంలోని పై అంతస్తుల వరకు అగ్నికీలలు వ్యాపించడంతో అక్కడి పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగిందా అనే వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ, పోలీసుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Also Read : అంగన్వాడీ చిన్నారులకు గుడ్న్యూస్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.


2 thoughts on “Narsingi Fire Accident | నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం”