* గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయనను స్మరించుకున్న నేతలు, ప్రజలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ (Ambedkar) జయంతి సందర్భంగా దేశం ఆయనకు నివాళి అర్పించింది. రాష్ట్రపతి ముర్ము(Murmu), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) సహా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలు, ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. హైదరాబాద్ (Hyderabad) ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని సీఎం రేవంత్ అన్నారు. ఇక నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఆయన సేవలను స్మరించుకుందాం..
అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు (Ap Cm Chandrababu) పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pavan Kalyan) తెలిపారు. అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ..కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని ఆయన తెలిపారు.
……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
