* భారీ ఆపరేషన్ ను చేపట్టిన ఇండియన్ కోస్ట్ గార్డ్
ఆకేరు న్యూస్, డెస్క్ : గుజరాత్లో రూ.1800 కోట్ల విలువైన 300 కేజీల డ్రగ్స్ (Drugs)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, తీరగస్తీ దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. పారిపోయే ముందు అరేబియా సముద్రంలో ఈ డ్రగ్స్ ను స్మగ్లర్లు పాడేసినట్లు గుర్తించారు. పట్టుబడిన డ్రగ్స్ ను మెథంపేటమిన్(Methampetamin)గా అధికారులు అనుమానిస్తున్నారు. దేశంలోకి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను తీర గస్తీదళం భగ్నం చేసింది. అరేబియా సముద్రంలో భారత సముద్ర జలాల సరిహద్దు వద్ద గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(Gujarath Ante Terrorist Squad), భారత తీర గస్తీ (Indian Coast Guard) దళం ఈనెల 12-13 అర్ధరాత్రి వేళ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఓ బోటు కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో దాని దగ్గరకు వెళ్లాయి. కోస్ట్‌గార్డ్ నౌకను చూడగానే బోటులోని స్మగ్లర్లు తమ వద్ద ఉన్న సరకును సముద్రంలో పడేసి పారిపోయారు. దీంతో కోస్ట్‌గార్డ్, ఏటీఎస్ సిబ్బంది సముద్రంలోకి దిగి సరకును స్వాధీనం చేసుకున్నారు. అందులో 300 కిలోలకు పైగా నిషేధిత మెథాంఫేటమిన్ ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.1800 కోట్లకుపైనే ఉంటుందని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్‌ను యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు తీర గస్తీదళం ఓ ప్రకటనలో వెల్లడించింది.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
