
*వ్యూహ..ప్రతివ్యూహాల్లో ఇరు పక్షాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉప రాష్ట్రపతి
పదవికి జగదీప్ దన్కడ్ (JAGDEEP DHANKAD) రాజీనామా చేయడంతో
ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.ఈ నేపధ్యంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నేత రాధాకృష్ణన్ ను ఎన్డీయే తమ (RADHA KRISHNAN) అభ్యర్థిగా నిలబెట్టింది.మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. బిజెపికు నమ్మకమైన, విశ్వసనీయ వ్యక్తిగా పరిగణిస్తారు. ప్రముఖ రిటైర్డ్ న్యామమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని ఇండియా కూటమి రంగంలోకి దింపింది. బీజేపీ అధిష్టానం దక్షణాదిలో పార్టీని మరింత బలం చేకూర్చాలనే ఆలోచనతో తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిందనే వాదనలు విన్పించాయి. దీంతో న్యాయకోవిదుడిగా పేరున్న తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ( JUSTICE SUDERSHAN REDDY) ఇండియా కూటమి వ్యూహాత్మకంగా పోటీకి నిలిపింది. న్యాయవ్యవస్థలో సుదర్శన్ రెడ్డి నీతి, నిజాయితీ కలిగిన న్యాయమూర్తిగా ప్రసిద్ధి చెందారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను రక్షించడానికి ఆయన పనిచేస్తారని ప్రతిపక్షం నమ్ముతుంది. ఇద్దరూ దక్షిణాది వారే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఉభయ సభల్లోఎన్డీయే కూటమికి బలం ఉన్నా క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోనన్న అనుమానంలో ఎన్డీయే కూటమి ఉంది. దక్షిణాదికి చెందిన ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారన్న ఆశతో ఇండియా కూటమి ఉంది. ఈ నేపధ్యంలో ఇరు కూటమిలు దేశ వ్యాప్తంగా తమ అభ్యర్థ/ల గెలుపు కోసం ప్రచారం నిర్వహించాయి.
ఎవరి బలం ఎంత..?
లోకసభ,రాజ్యసభల్లో ఎవరి బలం ఎంత ఉందో తెలుసుకుందాం.ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు ఎవరు? పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికవుతారు. ఇది మాత్రమే కాదు నామినేటెడ్ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలకు ఎటువంటి పాత్ర లేదు. 2025 లో ఖాళీగా ఉన్న పదవులను
మినహాయించి ఉభయ సభలకు 782 మంది ఎంపీలు ఉంటారు. వీరిలో 543
మంది లోక్‌సభ, 233 మంది రాజ్యసభ, 12 మంది నామినేటెడ్ సభ్యులు.
ప్రతి ఎంపీ ఓటు విలువ ఒకేలా ఉంటుంది.ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఓటింగ్‌ను పర్యవేక్షించడానికి రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. ఈ ఓటింగ్ 1974 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమాలలోని 8వ నిబంధన ప్రకారం పార్లమెంట్ హౌస్‌లో
జరుగుతుంది. ఒకే బదిలీ చేయగల ఓటు (STV) ఉపయోగించి పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో రహస్య బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో (1, 2, 3, మొదలైనవి) ర్యాంక్ చేస్తారు. ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికి పైగా కలిగి ఉండాలి. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ లభించకపోతే.. అత్యల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగించి, అతని బ్యాలెట్ పత్రాలను తదుపరి అందుబాటులో ఉన్న ప్రాధాన్యతలకు బదిలీ చేస్తారు. అభ్యర్థి మెజారిటీ సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గణాంకాలను పరిశీలిస్తే, లోక్‌సభలో NDA ఎంపీల సంఖ్య 293 ,రాజ్యసభలో 130. అంతేకాదు 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఈ విధంగా NDA మొత్తం 435 మంది ఎంపీలను కలిగి ఉంది. ఇండియా కూటమి పార్టీల ఎంపీలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ 98, సమాజ్ వాది 37,తృణమూల్ కాంగ్రెస్ 29,డీఎంకే 22,శివసేన 9 ఎన్సీపీ 8,సీపీఐ ఎం 4,ఆర్జేడీ 4,ఆమ్ ఆద్మీ 3,ఐయూఎంఎల్ 3,జేఎంఎం 3, సీపీఐ ఎంఎల్ ఎల్ 2,సీపీఐ2,జేకేఎన్ సీ 2,వీసీకే 2,బీఏపీ 1,కేఈసీ 1,ఎంబీఎంకే 1 ఆర్ ఎల్ పీ 1,ఆర్ ఎస్ పీ 1782 మంది ఎంపీలు ఎన్నికల్లో పాల్గొంటారు. అటువంటి పరిస్థితిలో మెజారిటీ సంఖ్య 392. అయితే క్రాస్ ఓటింగ్ జరుగకపోతే ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలుపుఖాయమని తెలుస్తోంది.
…………………………………………….