
* పురిటిలోనే పసికందు మృతి
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. ఓ పసికందు ప్రాణాన్ని బలిగింది. జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కకు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ములుగు జిల్లాకు చెందిన విల్లా రవళికి నెలలు నిండడంతో.. ప్రసవం కోసం నిన్న ఉదయం ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. సాయంత్రం వరకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. గర్భిణీ పరిస్థితి బాగా లేకపోవడంతో ఆపరేషన్ అన్న చేయండి.. లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తామని వైద్యులకు కుటుంబ సభ్యులు తెలిపారు. నార్మల్ డెలివరీ కోసం వేచి చూసిన డెలివరీ కాకపోవడంతో బలవంతంగా నార్మల్ డెలివరీకి వైద్యులు ప్రయత్నించారు. వైద్యులు బలవంతంగా నార్మల్ డెలివరీకి ప్రయత్నించడంతో పురిటిలోనే బిడ్డ చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాబు చనిపోయాడని గర్భిణీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. చనిపోయిన తమ బిడ్డని చేతిలో పెట్టి ఏం చేసుకుంటారో, చేసుకోండి అంటూ వైద్యులు బెదిరిస్తున్నారు బాధితులు వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని, తమకు న్యాయం జరిగే వరకూ ఆస్పత్రి నుంచి కదిలేది లేదని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.
…………………………………..