* కొత్త సంవత్సరంలో కొంగొత్త నిర్ణయాలు
* ఎలా ఉంటే మంచిది.. ఏం చేయాలి?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
కొత్త సంవత్సరాలు వస్తుంటాయి.. పాతవై పోతుంటాయి. కానీ క్యాలెండర్లో ఇయర్ మారినప్పుడల్లా ఈ ఏడాది నుంచైనా అంటూ.. కొందరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పాటిస్తారా.. లేదా అనే విషయాలను పక్కన పెడితే అనుకోవడం మాత్రం సాధారణమే. అలాంటి వాటిలో ఎక్కువగా ఆరోగ్యానికి చెందినవే ఉంటాయి.
వైద్యపరంగా..
అయితే వైద్యపరంగా 2026 కొన్ని మార్పులనే తెచ్చిందని చెప్పొచ్చు. అందులో ఒకటి ఆరోగ్య బీమాకు జీఎస్టీ లేకపోవడం. వైద్య ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఇన్సూరెన్స్లకు ప్రాధాన్యం పెరగనుంది. ఒకప్పుడు ఆరోగ్య బీమా అంటే డబ్బులు వృథా అని చాలా మంది భావించేవారు. ఇప్పుడు ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జీవనశైలి వ్యాధులే, ఆరోగ్య పరంగా అత్యఽధిక భారాన్ని ప్రజలపై మోపుతున్నాయి. మధుమేహం, క్యాన్సర్, ఆర్ధరైటీస్, క్యాన్సర్ కేసులు ఎక్కువగానే ఉన్నాయంటోంది. తమకు వచ్చే క్లెయిమ్‌లలో అధిక శాతం గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి జీవనశైలి వ్యాఽధులు అఽధికంగా ఉన్నాయని కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు చెబుతున్నాయి.
ఆరోగ్యం కోసం..
ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన కనీస నియమాలను కూడా చాలా మంది పాటించరు. కనీసం ఆరు నెలలకోమారు అయినా రక్తపరీక్షలు చేయించుకుంటే మంచిదని డాక్టర్లు చెబితే, డబ్బులు కోసం చెబుతున్నారనుకునే వారు కానీ, నివారణ ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యతను ఇప్పుడు గుర్తిస్తున్నారు. కనీసం సంవత్సరానికి ఓ మారు అయినా కంప్లీట్ బాడీ చెకప్ అనేది తప్పనిసరి చేసుకునే అవకాశాలు ఈ సంవత్సరం విస్తృతంగా కనిపించే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మరి అభిరుచులో..
ఆరోగ్యం సంగతిని పక్కనపెడితే అభిరుచులను తీర్చుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. డ్యాన్స్, తబలా, పియానో, చిత్రలేఖనం వంటి కళలు, హిందీ, ఇంగ్లిష్., ఫ్రెంచ్, స్పానిష్ వంటి ఇతర భాషలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపే వారు ఉంటారు. అందుకోసం నిరాస, నిస్పృహలను వీడాలని నిపుణులు పేర్కొంటున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కూడా ఉంటారు. అలాంటి వారు ఆశ్రమాల్లో వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. వారికి అవసరమైన సేవలు అందించవచ్చు.
……………………………………………………..

