Errabelli Pradeep Rao
* బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజవర్గంలోని పోచమ్మ మైదాన్ కూడలిలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న సుమారు 17,000 మంది ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు.
సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం నిరవధిక సమ్మెకు దిగాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేసి, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

