NIMS Additional Superintendent
* అడిషనల్ సూపరింటెండెంట్ నివాసంలోనూ తనిఖీలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :హైదరాబాద్లో నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డా. లక్ష్మీభాస్కర్కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు (ACB Raids ) కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
ఎర్రగడ్డలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఆయన ఇంటితో పాటు నిమ్స్ ఆసుపత్రిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు జిల్లాల్లో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
డా. లక్ష్మీభాస్కర్పై గతంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాల్లో లభించే పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే సోదాలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలు, నగదు లేదా ఇతర వివరాలపై అధికారికంగా పూర్తి సమాచారం వెల్లడించాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
