* ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ఆకేరు న్యూస్, న్యూఢల్లీి: జర్నలిస్టులపై క్రిమినల్ పెట్టడం సరికాదని ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్టులు ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. కాగా.. యూపీ ప్రభుత్వ అధికారుల్లో కుల సమీకరణాలను ఉద్దేశించి జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్ రాజ్’ శీర్షికన ఒక కథనం రాయగా.. లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 20న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ విచారించారు. పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కేవలం జర్నలిస్టు రాసినవి ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయనే కారణంతో క్రిమినల్ కేసులు పెట్టొద్దని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అలాగే ఈ లోగా పిటిషనర్దారుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
………………………………………