* పీజేఆర్ హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగింది
* జూబ్లీహిల్స్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బీఆర్ ఎస్ పాలించిన పదేళ్ల కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరిస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బోరబండ డివిజన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పీజే ఆర్ బతికుండగా చేసిన అభివృద్దే కన్పిస్తోందని పీజే ఆర్ తరువాత జూబ్లీ నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యమం పేరుతో బీఆర్ ఎస్ పెద్దలు వైట్ కాలర్ రౌడీయిజాన్ని పెంచి పోశించారని నాయిని ఆరోపించారు. నవీన్ యాదవ్ ప్రజా నాయకుడని ఆయనని రౌడీ బీఆర్ ఎస్ నాయకులు అనడం దొంగలే దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. బీఆర్ ఎస్ పార్టీ ప్రజలకు చిన్న చిన్న గిఫ్ట్లు పంపిణీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పడు ప్రజలకు బాకీ పడే ఉంటుందన్నారు. ప్రజల రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేనిదే అన్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. విజ్ఞతతో ఆలోచించే అభివృద్ధి చేసే పార్టీకే ఓటు వేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు.
………………………………………….
