
* జీహెచ్ఎంసీపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) జీహెచ్ఎంసీ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్లో చేరారు. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దానం జీహెచ్ఎంసీ(Ghmc) తీర్పుపై స్పందిస్తూ వాళ్ళు నా ఇంటి వద్దే చెత్తను తొలగించడం లేదు.. ఇదెక్కడి చోద్యం అని ప్రశ్నించారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శలు గుప్పించారు. “నా ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందని జీహెచ్ ఎంసీకి ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కొంత చెత్త తీసి మిగతాదంతా అలానే ఉంచేసి వెళ్లారు.. పారిశుధ్యం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరు బాగాలేదు” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసే పని పకడ్బందీగా, మంచిగా చేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేద అని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
………………………………………..