
* సంఘ పరివార్ కోరుకున్నంత కాలం సేవలందిస్తా..
* తేల్చి చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి
*మోదీ రిటైర్మెంట్ పై మాట్లేడేందుకు ప్రతిపక్షాలకు నో చాన్స్
ఆకేరు న్యూస్ డెస్క్: రిటైర్మెంట్ విషయంపై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన భగవతి క్లారిటీ ఇచ్చారు. 75 ఏళ్లు నిండిన తరువాత రాజకీయాల్లోంచి రిటైర్ కావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం మాట్లాడారు. 75 ఏళ్ల వయసులో తాను రిటైర్ అవుతానని కానీ లేదా ఇంకెవరినైనా రిటైర్ కావాలని కాని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. సంఘ్ పరివార్ కోరుకున్నంత కాలం తాను పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే గత కొంత కాలంగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవతి, ప్రధానినరేంద్ర మోదీలకు సెప్టెంబర్ నెలతో 75 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. గత కొంత కాలంగా మీడియాలో మోదీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతోంది. ప్రతి పక్షాలు కూడా మోదీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాయి. ఈ నేపధ్యంలో మోహన్ భగవతి గురువారం చేసిన వ్యాఖ్యలతో ఈ అంశానికి తెరబడినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
……………………………………