
* తరలివచ్చిన వివిధ రంగాల ప్రముఖులు
* పార్టీలకు అతీతంగా హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ (ALAY-BALAY) సందడిగా కొనసాగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉద్యమ సమయంలో రాజకీయ నేతల మధ్య ఐక్యత కోసం దత్తాత్రేయ (DATTATREYA) ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. భారతీయ సాంస్కృతిక ఔన్నత్య పునరుద్ధరణ యజ్ఞంలో భాగంగా రాజకీయలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల మధ్య ఏకాత్మతాభావం నెలకొల్పేందుకు గత 17 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా విజయదశమి మరుసటి రోజు ఆలయ్ బలయ్ నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రముఖులు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు ఆలయ్ బలయ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఆత్మీయుల అలయ్ బలయ్ ఆలింగనాలు, షడ్రుచుల సమ్మేళనం, ఒగ్గుడోలు తాళాల మోత, జొన్న కర్రల జోరు, ఆడబిడ్డల కోలాటాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డోలు వాయిస్తూ, బతుకమ్మ ఆడిపాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సందడి చేశారు. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన అధికారులను ఈ సందర్భంగా సన్మానించడం గమనార్హం. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(VENKAYYA NAIDU), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, మంత్రి కోమటి రెడ్డి, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కోదండరాం, సీపీఐ నేత నారాయణ, అజీజ్ పాషా, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.
…………………………………