* తాజాగా మరో నాలుగు విమానాల్లో కలకలం
ఆకేరు న్యూస్ డెస్క్ : విమానాలకు బాంబు బెదిరింపులు( Bomb Threats) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో నాలుగు విమానాలకు బెదిరింపులు వచ్చాయి. అందులో ఓ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Samshabad Airport)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines)కు చెందిన మూడు విమానాలకు, ఎయిర్ ఇండియా(Air india) విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో విమానాలకు ఐసోలేషన్ (Isolation)బేకు తరలించి పరిశీలిస్తున్నారు. గోవా నుంచి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పైలట్ ఆ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. భద్రతా సిబ్బంది, బాంబు స్వ్కాడ్ సిబ్బంది పూర్తి తనిఖీలు చేసి అవన్నీ ఫేక్ కాల్స్ అని నిర్ధారించారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్(Bengalore to Hyderabad)కు, హైదరాబాద్ నుంచి పుణె(Hyderabad to Pune)కు వెళ్తున్న ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాలకు ఐసోలేషన్‌కు తరలించి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అవన్నీ ఫేక్ కాల్స్‌గా నిర్ధారించారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
………………………………………..