ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతినిచ్చారు. ఫార్ములా ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. ఇదంతా అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ అనుమతి వల్లే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఫార్ములా ఈ కేసును లొట్టపీసు కేసుగా కేటీఆర్ కొట్టిపారేస్తూ వస్తున్నారు. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇచ్చారు. ఫార్ములా ఈ-రేసు..లో బీఆర్ ఎస్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ప్రభుత్వం పదే పదే చెబుతూ వచ్చింది. నిధుల దుర్వినియోగంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న కేఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది.
……………………………………………
