
* గ్యారెంటీల పేరుతో గారడీలు చేశారు
* రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన సాగుతోంది
* రైతుబంధు ఇచ్చేవరకు కాంగ్రెసోళ్లను ఉరికించండి..
* మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
ఆకేరు న్యూస్, మానుకొండూరు : ముఖ్యమంత్రి పేరు ఇకపై ఎనుముల రేవంత్ రెడ్డి(Revanthreddy) కాదని, ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(HarishRao) విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బీఆర్ ఎస్(Brs) ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలు, ర్యాలీలు నిర్వహించింది. మానకొండూరులో జరిగిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్(Congress) అమలు చేయడంలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన సాగుతోందని విమర్శించారు. గ్యారెంటీల పేరుతో గారడీ చేశారన్నారు. రైతుబంధు ఇచ్చే వరకు కాంగ్రెసోళ్లను తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తులం బంగారం దగా.. రైతు భరోసా దగా.. జాబ్ కార్డు దగా.. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవతేల రేవంత్ రెడ్డి అన్నారు. కరోనా కాలంలోనూ కేసీఆర్ రైతు బంధు ఆపలేదని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టండి.. ఇతర కార్యక్రమాలన్నీ బంద్ పెట్టండి.. రైతు బంధు మాత్రం సమయానికి ఇవ్వాల్సిందే అని నాడు కేసీఆర్(Kcr) పనిచేసేవారని తెలిపారు.
……………………………………….