* ప్రాయశ్చిత్త దీక్షపై పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, తిరుమల: ‘లడ్డూ’ కోసమే ప్రాయశ్చిత్త దీక్ష కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు బయల్దేరిన పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని.. కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. రామతీర్థంలో రాముడి తలను నరికారని చెప్పారు. ప్రభుత్వం అన్నింటిపైనా విచారణ జరిపిస్తుందని తెలిపారు. దేవుడిపై రాజకీయాలు చేయవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలకవ్యాఖ్యలు చేశారు. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా అనలేదని తెలిపారు. వారికి ఉన్న సమాచారంతో మాత్రమే వాళ్లు అలా అన్నారని పేర్కొన్నారు. నెయ్యి వచ్చిన తేదీల విషయంలో కొద్దిగా అయోమయం ఉందని వారు తెలిపారన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు.
…………………..