* రుణమాఫీ, మంత్రివర్గ విస్తరణపై చర్చ
ఆకేరు న్యూస్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ టూర్(RevanthReddy Delhi Tour)లో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే(Kharge)ను, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(Kc Venugopal)ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరిని చర్చించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశామని మరోసారి వివరించినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఖర్గేను రేవంత్ పరామర్శించారు. మరికొందరు కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలిసే అవకాశం ఉంది. కాగా, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించేందుకే రేవంత్ ఆకస్మికంగా ఢిల్లీ(Delhi) వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
