* మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరు న్యూస్ పర్వతగిరి : ప్రజా పాలన పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాక్షసపాలన కొనసాగిస్తోందోనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.బుధవారం ఆయన పర్వతగిరి మండలం కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తిండి తిప్పలు మానేసీ యూరియా కోసం క్యూలైన్లలో నిల్చునే దుస్థితి ఉందన్నారు. కేవలం ఒక్క బస్తానే యూరియా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఆరు నెలల ముందే ఎరువులను నిలువ చేసే పంపిణీ చేసే వారని ఎర్రబెల్లి అన్నారు. ప్రభుత్వానికి పరిపాలించడం చేతకావడం లేదని అన్నారు. ముందు చూపు సరైన ప్రణాళిక లేక పోవడంతో ఈ రోజు రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తాయని ఎర్రబెల్లి ఆరోపించారు.
……………………………………………..
