* బీజేపీ తరువాత నోటాకే ఓట్లు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఉప ఎన్నికల్లో నోటా (NOTA) ప్రభావం కనబడుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ హోరీ హోరీ ప్రచారం చేశాయి. దాదాపు ఇదే వరుసలోనూ ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నాయి. బీజేపీ తరువాత స్థానంలో నోటా కొనసాగుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీ నాయకులను మినహాయిస్తే 55 మంది స్వాతంత్ర అభ్యర్థులకంటే నోటాకే అధిక ఓట్లు పోలవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి మొత్తంగా 10 రౌండ్లలో ఎన్ని ఓట్లు వస్తాయి కాసేపట్లో తేలనుంది.
…………………………………………..
