
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ అర్ధరాత్రి ఎమ్మెల్యేకు వీడియో కాల్ వచ్చింది. ఎవరో, ఏ అవసరం కోసం చేశారో అని లిఫ్ట్ చేయగానే.. షాకింగ్ దృశ్యం. ఓ అమ్మాయి న్యూడ్‌గా కనిపించింది. వెంటనే కాల్ కట్ చేసిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఓ వీడియో కాల్ వచ్చింది. తెలియని నంబర్ నుంచి ఆ కాల్ వచ్చింది. ప్రజాప్రతినిధి కావడంతో ఎవరైనా అవసరం కోసం ఫోన్ చేసి ఉంటారని భావించి కాల్ ఆన్సర్ చేశారు. లిఫ్ట్ చేయగానే న్యూడ్‌గా ఓ అమ్మాయి కనిపించడంతో ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశారు. ఈ వీడియో కాల్ గురించి ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో సదరు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
…………………………………………