Two-Headed Baby Born in Odisha
*రెండు తలలు.. ఒకే శరీరం!
* 3 లక్షల జననాల్లో ఒకటయ్యే ‘డైసెఫాలిస్ పారాపాగస్’ కేసు
* బెర్హంపూర్ MKCG ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స
ఆకేరు న్యూస్, డెస్క్ : ఒడిశా రాష్ట్రంలో అత్యంత అరుదైన వైద్య సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కంధమాల్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల గర్భిణికి ఒకే శరీరంతో, రెండు తలలు కలిగిన అరుదైన మగ కవల శిశువు జన్మించారు.
* అరుదైన శస్త్రచికిత్స ద్వారా జననం
కంధమాల్ జిల్లాకు చెందిన ఈ మహిళకు ప్రసవ వేదన తీవ్రం కావడంతో బెర్హంపూర్ లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘మహారాజా కృష్ణచంద్ర గజపతి’ (MKCG) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు.
పరిశీలించిన వైద్యులు ప్రసవం క్లిష్టతను గ్రహించి సి-సెక్షన్ (C-Section) ద్వారా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. డెలివరీ అనంతరం శిశువులను చూసి తల్లిదండ్రులతో పాటు వైద్య సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు.
* ఏమిటీ ‘డైసెఫాలిస్ పారాపాగస్’
పుట్టుకతో వచ్చే ఈ అరుదైన వైద్య పరిస్థితిని వైద్య పరిభాషలో ‘డైసెఫాలిస్ పారాపాగస్’ (Dicephalic Parapagus) అని పిలుస్తారు.
లక్షణాలు : ఈ రకమైన కవలలలో ఇద్దరు శిశువులు ఒకే శరీరం (Single Torso), రెండు కాళ్లు, రెండు చేతులు కలిగి ఉంటారు, కానీ రెండు వేర్వేరు తలలు (Two Heads) ఉంటాయి.
వీరిలో చాలావరకు ప్రధాన అంతర్గత అవయవాలు (ఒకే గుండె, ఒకే కడుపు) ఉమ్మడిగా ఉంటాయి. సగటున 3 లక్షల ప్రసవాల్లో ఒక కేస మాత్రమే ఇలాంటి వైకల్యంతో నమోదవుతుందని వైద్య నిపుణులు తెలిపారు.
* ఆస్పత్రి SNCU విభాగంలో ప్రత్యేక పర్యవేక్షణ
ప్రస్తుతం ఈ అరుదైన శిశువులను MKCG ఆసుపత్రిలోని SNCU (Special Newborn Care Unit) విభాగంలో ఉంచి, శ్వాసక్రియ మరియు రక్త ప్రసరణ వ్యవస్థలను ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
శిశువుల అంతర్గత అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయనేది నిశితంగా అంచనా వేస్తున్నామని, పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యం ప్రస్తుతం సురక్షితంగా మరియు స్థిరంగా ఉన్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

