* ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన
* పీఎల్ జీఏ కార్యకలాపాలు ముగిసినట్లేనా..?
ఆకేరు న్యూస్ ,డెస్క్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. భద్రతా దళాల చేతిలో ఓ వైపు మావోయిస్టులు నేలకొరుగుతుండగా మరో వైపు మావోనేతల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత పీఎల్ జీఏ బెటాలియన్ కమాండర్ గా వ్యవహరిస్తున్న బర్సె దేవా పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ చత్తీస్ ఘడ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంత అడవుల్లో ఆయనతో పాటు మరో 15 మంది సాయుధులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుండి భారీ ఎత్తున్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారంతా దేవా నేతృత్వంలోని బెటాలియన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితె్లో మావోయిస్టు పార్టీకి ఉన్న కీలక త్రయంలో
ఆయన ఒకరు. పార్టీ చీఫ్ తిప్పిరని తిరుపతి అలియాస్ దేవుజీ తెలంగాణ పార్టీ కార్యదర్శి
బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తో పాటు దేవా ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. బర్సెదేవా, ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన కరడుగట్టిన మావోయిస్టు నేత హిడ్మాతో కలిసి సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసినట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లో కమాండెంట్‌గా పనిచేసిన బర్సెదేవా, అనేక కీలక మావోయిస్టు ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పలు దాడుల్లో బర్సెదేవాది కీలక పాత్ర ఉన్నట్లు ఛత్తీస్గడ్ పోలీసులు గతంలోనే పేర్కొన్నారు. ఆయనపై ప్రస్తుతం రూ.50 లక్షల రివార్డు ఉంది. కొద్ద రోజుల క్రితం మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్తు అగ్రనేత హిడ్మాకు దేవా సమాకాలికుడు. దేవాది కూడా చత్తీస్ గడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని హిడ్మా స్వస్థలం అయిన పూవర్తి గ్రామమే . ఇంచుమించు ఒకే సారి ఇద్దరు పార్టీలో చేరారు. పార్టీ బెటాలియన్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు.
పీఎల్ జీఏ కార్యకలాపాలు ముగిసినట్లేనా..?
మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు వెన్నుముకగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ
కార్యకలాపాలు దాదాపుగా ముగిసినట్లే హిడ్మా మృతితో పీఎల్ జీఏ మిన్ను విరిగినట్లు అవగా .. దేవా చిక్కడంతో ఇక అది కనుమరుగైనట్లే అనే అభిప్రా\యాలు ఉన్నాయి.
……………………………………………………

