ఆకేరు న్యూస్ , కమలాపూర్ : భారీ వర్షాల (Heavy rains) పట్ల కమలాపూర్ మండలం (Kamalapur Mandal)లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ,ఎక్కడ సమస్య తలెత్తిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఎంపీడీవో గుండె బాబు (MPDO Gunde Babu) ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం (Sriramulapalli village) వర్షపు నీటితో జలదిగ్బంధమైంది. గ్రామంలోని ఇండ్లలోకి ఒక ఫీట్ మేరకు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం తెలుసుకున్న కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ(JCB) సహాయంతో నీటిని పంట పొలాల్లోకి వెళ్ళేట్టుగా చర్యలు చేపట్టారు. కమలాపూర్, ఉప్పల్ పలు గ్రామాలలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కాగా గ్రామాలోని ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
———————-