* ఆటోలో ఇద్దరు యువకుల మృత దేహాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ పాత బస్తీలో కలకలం చోటుచేసుకుంది. హైదరాబాద్ – చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి, డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో డ్రగ్స్ ఇంజక్షన్లు లభ్యమయ్యాయి. మృతి చెందిన యువకులను ఇర్ఫాన్, మహ్మద్ జహంగీర్లుగా పోలీసులు గుర్తించారు
పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
