* తొలి సోమవారం భక్తుల సందడి
ఆకేరు న్యూస్ డెస్క్ : కార్తీకమాసం(Karthika Masam) తొలి సోమవారం నేపథ్యంలో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలతో శోభను సంతరించుకున్నాయి. తెలంగాణ(TELANGANA) వ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. కీసరగుట్ట(KESARAGUTTA)లో జరిగే పూజలకు మంత్రి కొండా సురేఖ(MINISTER KONDA SUREKHA) హాజరుకానున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ(VEMULAWADA) శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారికి గోపూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు. కార్తిక మాసం మొదటి సోమవారం కావండతో రెండుసార్లు సత్యనారాయణ వ్రతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్నపూజ సేవలను రద్దు చేశారు. వాడపల్లి(WADAPALLI)లోని మీనాక్షి అగస్తేశ్వర ఆలయంతో పాటు పిల్లలమర్రి, మేళ్లచెరువు తదితర ఆలయాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. భద్రాచలంలోని గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలను నదిలో వదులుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని దర్శించుకుంటున్నారు. ఖమ్మం(KHAMAM) జిల్లా ఏన్కూర్‌లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆద్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. బీఆర్పురం శివాలయం, నాచారం(NACHARAM)లోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయాల్లో అభిషేకాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలోనూ ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.
…………………………………………………………..