* ఒకరు మృతి.. నలుగురికి గాయాలు..పలు కార్లు ధ్వంసం
* ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి
* మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం
* టెర్మినల్ -1 నుంచి విమానాలు రద్దు : రామ్మోహన్ నాయుడు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) టెర్మినల్-1లో పైకప్పు కూలిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. పలు కార్లు ధ్వంసం అయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rmmohan Naidu) విమానాశ్రయాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించారు. తాజా సమాచారం ప్రకారం.. ఎయిర్ పోర్టులో పైకప్పు కూలడంతో ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం పరిహారం ప్రకటించారు. ఉదయం 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలిపారు. టెర్మినల్ -1 నుంచి విమానాలు రద్దు చేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
వరద బీభత్సం
భారీ వర్షాలతో ఢిల్లీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. ఢిల్లీలో వచ్చే ఏడు రోజులపాటు వాతావరణం సాధారణంగా మేఘావృతమై, గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి ( IMD) అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. జూన్ 30న ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
———————