ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది ఇద్దరికి గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి రాంనగర్ వైపు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బండ్లగూడకు చెందిన ఫాతిమా అనే మహిళ తన కొడుకు ఇబ్రహీం , కూతరు మోహిక్ తో కలిసి వెళ్తుండగా వీఎస్టీ చౌరస్తా వద్ద ప్రమాద వశాత్తు అటుగా వెళ్తున్న ఫైర్ ఇంజన్ వెనుక టైర్ కింద స్కూటీ పడింది. ఈ ప్రమాదంలో కూతురు మోహిక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తల్లీ కొడుకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..తల్లీ కొడుకులిద్దరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………………….
