* దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
* రాహు్ల్పై బీజేపీ నేతల వ్యాఖ్యలపై భగ్గు
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశంలో నంబర్ వన్ టెర్రరిస్టు.. ఆయన తలకు 11 లక్షలిస్తా అంటూ.. రాహుల్ గాంధీ(RahulGandhi)పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్(Central Minister RavnithSingh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ దేశంలోనే అతిపెద్ద ఉగ్రవాదిగా అభివర్ణించారు. అమెరికా పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వేర్పాటువాదులు, విధ్వంసకారులు, విచ్ఛనవాదులు మాత్రమే సమర్థిస్తారని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్(Congress), బీజేపీ(Bjp)ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బీజేపీ నేతల దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు చేపడుతూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఢిల్లీ(Delhi)లోని రవణీత్ సింగ్ ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే.. హైదరాబాద్(Hyderabad) బీజేపీ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కార్యాలయాన్ని ముట్టడించారు. త్యాగాల ఫ్యామిలీ గాంధీ కుటుంబంపై నోరు పారేసుకుంటున్న బీజేపీ నేతల పిచ్చి.. పరాకాష్ట చేరిందన్నారు. మోదీ ఆ నేతలతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఏపీ(Ap) కాంగ్రెస్ అధినేత్రి షర్మిల విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. రవ్నీత్ సింగ్ ను అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.