* ఆన్లైన్ గేమ్‌లో నష్టపోయి కానిస్టేబుల్ ఆత్మహత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆన్ లైన్ భూతం మనుషుల ప్రాణాలను మింగేస్తోంది. గతంలో ఆన్ లైన్ గేమ్‌లు ఆడి నష్టపోయి ప్రాణాలు తీసుకున్నసంఘటనలు ఉన్నాయి. మానసిక పరిపక్వత లేని వాళ్లు, యువకులు విద్యార్థులలు ఆన్ లైన్ గేమ్ లకు బానిసలుగా మారుతున్నారు. కానీ ఓ కానిస్టేబుల్ ఆన్ లైన్ గేమ్‌లకు బానిస అయి చివరికి అప్పుల పాలై ఆత్మ హత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌లో జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సందీప్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వ్యసనానికి లోనై ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఆన్ లైన్ గేమ్‌లకు బానిసగా మారిన సందీప్ తన తోటి ఉద్యోగుల వద్ద అప్పులు చేసినట్లు తెలుస్తోంది. చివరికి అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యపై ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………………..
