* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యంషాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. ఇటీవల కొత్త లిక్కర్ పాలసీకి క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ రాబోతుంది.
రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014-19 వరకు ఉన్న మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నారు. మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్కే అప్పగించనున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనందునా ఆర్డినెన్స్ ద్వారా మద్యం షాపులను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 3,396 వైన్షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనుండగా.. మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.
……………………………………….