
సత్తా చాటాలి.
* ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్
ఆకేరు న్యూస్, ములుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచించారు . ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కష్ట పడి ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ములుగు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే 100 శాతం విజయాన్ని సాధించేలా పని చేయాలని సూచించారు.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ విజయంలో భాగస్వాములు కావాలని కోరారు.
పార్టీలో కష్ట పడ్డవారికి కచ్చితంగా గుర్తింపు లభిస్తుంది అని పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని కోరారు. కష్ట పడి పని చేసిన వారిని పార్టీ , మంత్రి సీతక్క గుర్తిస్తుందని అన్నారు
ఈ సమావేశంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,వివిధ మండలాల అధ్యక్షులు,మహిళ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
—————————-