
ఆకేరు న్యూస్, వరంగల్ : వినాయక నవరాత్రుల సందర్భంగా నగరంలో వందల సంఖ్యలో వినాయక మండపాలు వెలిశాయి.. ఎన్ని మండపాలు ఉన్నా ప్రతీ సారీ పిన్నవారి వీధిలో ఏర్పాటు చేసే మండపం ఓ ప్రత్యేకత కలిగి ఉంటుంది. పిన్నవారి వీధిలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని చూడడానికే భక్తులు ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు. గత 44 ఏళ్లుగా నిర్వాహకులుతమ దైన ఓ ప్రత్యేకతతో అక్కడ మండపం ఏర్పాటు చేస్తూ విగ్రహాలు కూడా దృష్టిని ఆకర్శంచే విధంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపధ్యంలో ఫ్రెండ్స్ యూనిట్ గణపతి నిర్వాహక కమిటీ అధ్యక్షుడు గందె నవీన్ ఆకేరు న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. గత 44 ఏళ్లుగా ఫ్రెండ్స్ యూనిట్ గణపతి నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో రీతిలో ప్రతిష్టిస్తామన్నారు. వినాయకుడి విగ్రహం అందరినీ ఆకరశించేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. చూడగానే భక్తులను ఆకర్శించే విధంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. భారత దేశంలో ఉన్న దేవాలయాల నమూనాలను మండపం వద్ద ఏర్నాటు చేస్తామని తెలిపారు. భక్తులు ఎంతో దూరం పోయి దర్శనం చేసుకోలేని ఆలయాల నమూనాలను మండపం వద్ద ఏర్పాటు చేస్తే భక్తులు ఎంతో సంతృప్తి చెందుతారని గందె నవీన్ తెలిపారు. గతంలో ఆయోధ్య రామమందిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే తిరుపతి ఆలయాన్ని,జ్యోతిర్లింగాలను, శక్తిపీఠాలను,అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని,ఐలోని మల్లన్న ఆలయాన్ని,సమ్మక్క సారలమ్మలు కొలువైన మేడారంను ఇలా ప్రతీ సందత్సరం ఏదో ఒక ప్రత్యేక ఆలయాన్ని మండపం వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ఈ ఏడాది పంచముఖ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకర్శిస్తున్నాడని తెలిపారు. అలాగే వినాయకుడు అడవిలో ఆడుకుంటున్నట్లుగా,కాణిపాకం గణపతి బావిలో నుండి వస్తున్నట్లుగా ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఈ సారి జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్టించామనితెలిపారు.సనాతన ధర్మాన్ని,సాంప్రదాయాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతీ ఏడాది పిన్నవారి వీధిలో ఏర్పాటు చేసే గణపతి విగ్రహాన్ని చూడడానికి 4 నుండి 5 లక్షల మంది వస్తారని గందె నవీన్ తెలిపారు.
……………………………………….